చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించి SI సహా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్టేషన్లో నిల్వ ఉంచిన బాణాసంచాను బయటకు తీస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

పేలుడు ప్రభావంతో పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కారు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
