Chandanagar పోలీస్ స్టేషన్‌లో International Women’s Day వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ Vijay Shankar ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందిని సన్మానించి కానుకలు అందజేశారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగినుల సేవలను కొనియాడారు. పోలీస్ విభాగంలో మహిళలు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎస్‌హెచ్‌ఓ విజయ్ శంకర్ తెలిపారు.కార్యక్రమంలో ఎస్ఐ సంధ్య గొట్టిపర్తి సహా పలువురు మహిళా సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎస్సైలు ఆంజనేయులు, ఖ్వాజా మొయినుద్దిన్ తదితర పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.
