పేదల ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ధరణికోటలో ఆయన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.

కార్మికులతో కలిసి రూ.5 టోకెన్ కొనుగోలు చేసి భోజనం చేసిన సీఎం, పేదలకు స్వయంగా ఆహారం వడ్డించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 269కి చేరిందని తెలిపారు.పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 క్యాంటీన్లు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయని, త్వరలో మరికొన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. రోజుకు సుమారు 2.10 లక్షల మంది ఈ క్యాంటీన్ల ద్వారా భోజనం పొందుతున్నారని చెప్పారు.అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అభినందించిన సీఎం, తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా పేదలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
