చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ పుట్టపర్తి షెడ్యూల్ ఇదిగో

May 14, 2026 2:28 PM

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, ఏపీని డిఫెన్స్ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ భారీ ప్రాజెక్టు మొదలెట్టారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా మార్గం సుగమం కానుంది.

ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం 8.15 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు బయల్దేరుతారు. 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.50 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి ప్రయాణమవుతారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media