ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో గర్జించారు. సీఐఐ (CII) నిర్వహించిన ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ బ్రేక్ ఫాస్ట్ సెషన్లో పాల్గొన్న ఆయన, ఏపీలో ఉన్న అపార అవకాశాలను అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు వివరించారు.

APలో కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాత్రమే కాదు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అమలవుతోందని, పాలసీలను పరిశీలించాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. వ్యవసాయం, వైద్య రంగాల్లో డ్రోన్ల వినియోగానికి పెద్దపీట వేస్తున్నామని.. 2026 నాటికి ఏపీలో ‘డ్రోన్ అంబులెన్స్’ లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, స్పేస్ సిటీ, 1,054 కి.మీ. సముద్ర తీరం, పోర్టులు మరియు హైవే కనెక్టివిటీ ఏపీకి ప్రధాన బలాలని పేర్కొన్నారు.

భారతదేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో ఇప్పటికే 25 శాతం ఏపీ ఆకర్షించిందని పారిశ్రామికవేత్తలకు వివరించారు. తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని, యువశక్తితో సంపద సృష్టి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మాస్టర్ కార్డ్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు పాల్గొనగా, వారందరినీ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కలిసి ఏపీకి ఆహ్వానించారు.
