రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఆర్టీజీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రస్తుతం 14 వేల మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. మరో రెండు రోజుల్లో అదనపు నిల్వలు రానున్నట్లు వెల్లడించారు.పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఈ-కేవైసీ (e-KYC), ఓటీపీ విధానాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సీఎం సూచించారు. అత్యవసర పరిస్థితులకు ఇండక్షన్ స్టవ్స్‌ను సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశించారు.ఈ సమావేశంలో GAIL, ONGC ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
