హైద్రాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో సోమవారం ఛఠ్ పూజా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గాయని శార్దా సిన్హా ఆలపించిన భక్తిగీతాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి.సోమవారం ఈ నాలుగు రోజుల ఛఠ్ పండుగలో మూడో రోజు, సంధ్యా సమయం, భక్తులు నడుము వరకు నీటిలో నిలబడి సూర్యాస్తమయ వేళ ఫలాలు, చెరకు, గోధుమపిండి – బెల్లంతో చేసిన ‘తేఖువా’ వంటి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఆ రోజు మొత్తం ఉపవాసం కొనసాగించి, కుటుంబ సభ్యులు కలిసి భక్తి రాగాల మధ్య పూజలు నిర్వహించారు.
బీహార్, యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది భక్తులు సూర్యదేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజలు నిర్వహించారు.
