విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎం. బబిత అధ్యక్షతన నాల్సా బాలల న్యాయ సేవల పథకం 2024పై ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా 18 సంవత్సరాల లోపు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందుకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారని అధికారులు స్పష్టం చేశారు. చిన్న వయసులో వివాహాలు ఆరోగ్య సమస్యలు, శారీరక ఇబ్బందులకు దారితీస్తాయని తెలిపారు.బాల్య వివాహాల నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు. బాలల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కూడా సమీక్ష నిర్వహించారు.
