అర్హత ఉన్నప్పటికీ వికలాంగ పెన్షన్ అందకపోవడం చింతపల్లి మండలంలో చర్చనీయాంశమైంది. చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని బయలుకించంగి గ్రామానికి చెందిన సాగిన లక్ష్మి (45)కు 100% వికలాంగ ధ్రువీకరణ ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నడవలేని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న లక్ష్మి పూర్తిగా కుటుంబంపై ఆధారపడుతోంది. రోజువారీ కూలి పనులపై ఆధారపడే కుటుంబానికి వైద్య ఖర్చులు భరించడం భారంగా మారిందని తల్లి సోములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో సంక్షేమ పథకాల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని అర్హత మేరకు పెన్షన్ మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
