Inter ఫలితాల్లో 89% విజయంతో మెరిసిన చింతపల్లి Govt JR college

April 16, 2026 11:01 AM

2026 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా ఫలితాల్లో చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 89 శాతం ఉత్తీర్ణత సాధించి ఘన విజయాన్ని నమోదు చేసింది.

మొదటి సంవత్సరం 370 మంది విద్యార్థుల్లో 330 మంది, రెండో సంవత్సరం 302 మందిలో 268 మంది ఉత్తీర్ణులై రెండు సంవత్సరాల్లోనూ 89% ఫలితాలు నమోదు అయ్యాయి. గిరిజన ప్రాంతానికి చెందిన విద్యార్థులు అధికంగా చదువుతున్న ఈ కళాశాల మరోసారి తన ప్రతిభను చాటుకుంది.మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఉల్లి గ్రేస్ 96% తో టాపర్‌గా నిలవగా, రెండో సంవత్సరం ఎస్. కిరణ్ జ్యోతి 93.7% తో ప్రథమ స్థానం సాధించింది.అధ్యాపకుల కృషి, ప్రత్యేక స్టడీ అవర్స్‌, మోడల్ పరీక్షలు, విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపాల్ గోవిందరావు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media