AP:చిత్తూరు బస్సును ఢీకొన్న కారు ముగ్గురు మృతి video

March 28, 2026 12:45 PM

Chittoor జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొనడంతో కారు బస్సు కిందికి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వరంగల్‌కు చెందిన భర్త శ్రీధర్ రావు, భార్య లక్ష్మి, నాలుగేళ్ల కుమార్తె ఆద్వికగా గుర్తించారు.కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వారు బెంగళూరు నుంచి తిరుమల వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.ప్రమాదంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై Bangarupalem పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media