లంచం కోసం మహిళను మంగళసూత్రం తాకట్టు పెట్టించేలా ఒత్తిడి చేసిన ఎస్సై నరసింహులు వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. 2023లో జరిగిన ఈ ఘటన తాజాగా బయటపడటంతో విచారణ అనంతరం కఠిన చర్యలు చేపట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం, కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ నుంచి ఎస్సై లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో మెడలో ఉన్న మంగళసూత్రం తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేశాడు. తనకు పరిచయమున్న తాకట్టు వ్యాపారి వద్దకు పంపించి రూ.60 వేల వరకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇదే కాకుండా, మరో కేసులో నిర్దోషి యువకుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడానికి రూ.7 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో బాధితుడు విదేశీ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడు. మరో ఫిర్యాదును తప్పుడు కేసుగా చూపించి మూసివేసినట్లు కూడా బయటపడింది.ఈ ఘటనలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆరోపణలు నిజమని నిర్ధారించారు. అనంతపురం డీఐజీ ఆదేశాల మేరకు ఎస్సై నరసింహులను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
