AP:చోడవరం‌లో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు

April 18, 2026 11:25 AM

జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా చోడవరం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు మరియు గ్యాస్ లీకేజీ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక అధికారి రామస్వామి నాయకత్వంలో పట్టణంలోని అపార్ట్మెంట్ల నివాసితులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు మరియు బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక సిలిండర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యంత ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media