సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం సంబంధించి కీలక అప్‌డేట్ వెల్లడైంది. నవంబర్ 15న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమంలో సినిమా అధికారిక టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్‌ను విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపారు.చిత్రానికి ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మాణం అందిస్తున్నాడు. ఇప్పటికే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కథానాయిక కాదని, కేవలం ముఖ్యమైన పాత్రలోనే కనిపిస్తారని చిత్ర వర్గాలు స్పష్టం చేసాయి.
ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 15న రాబోయే అప్‌డేట్‌తో సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడవనున్నాయి.
