నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు దేవిన శ్రీనివాస్ తన అద్భుత ప్రతిభతో నివాళులర్పించారు. ఏఎన్నార్‌పై ఉన్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ కేవలం ఒక చిన్న సబ్బు బిళ్లపై ఆయన ముఖచిత్రాన్ని అత్యంత నైపుణ్యంతో చెక్కారు.

ANR గారి చిరునవ్వు, ఆయన ముఖ వర్చస్సు ఉట్టిపడేలా సబ్బుపై దేవిన శ్రీనివాస్ చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కళాఖండం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకర్షిస్తోంది. అక్కినేని అభిమానులు, కళాప్రేమికులు శ్రీనివాస్ ప్రతిభను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రంగులు, బ్రష్‌లతో కాకుండా, తన ఉలితో సబ్బుపై మహానటుడి రూపాన్ని మలచి, ఏఎన్నార్ స్మృతికి సరికొత్త రీతిలో ఘనత చేకూర్చారు.
