CINEMA :అరసాన్’ సినిమాలో(makkal selvan) విజయ్ సేతుపతి

November 25, 2025 3:20 PM

వెట్రిమారన్ దర్శకత్వంలో సిలంబరసన్ (సింబు) నటిస్తున్న యాక్షన్ డ్రామా అరసాన్ చిత్ర బృందం, మంగళవారం విజయ్ సేతుపతిని అధికారికంగా చిత్రంలోకి ఆహ్వానించింది. నిర్మాత కళైపులి S. ధాను ప్రత్యేక పోస్టర్‌ను ఎక్స్‌లో షేర్ చేస్తూ ఆయన ఎంట్రీని ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన తీవ్రమైన ప్రమోతో అరసాన్ భారీ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం VADA CHENNAI-2 ప్రపంచపు నేపథ్యంతో సాగుతుందని టీజర్‌లో స్పష్టమవుతున్నా, ఇది VADA CHENNAI-2 కాదు అని వెట్రిమారన్ ముందే స్పష్టంచేశారు.

ప్రమోలో సింబు డైరెక్టర్ నెల్సన్‌కు నిజ జీవిత హత్య కేసుల కథ చెబుతూ, కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నందున డిస్క్లైమర్ పెట్టాలని సూచించే సన్నివేశాలు కనిపిస్తాయి. అనంతరం సింబుపై ఒకే రాత్రిలో మూడు హత్యల కేసు నమోదై, కోర్టు విచారణకు హాజరయ్యే దృశ్యాలు కథపై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అరసాన్ ఆండ్రియా జెరెమియా, సముద్రకని, కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media