Cinema:90’s క్వీన్ రోజా రీ-ఎంట్రీ

November 6, 2025 12:27 PM

భారత చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా (Roja) మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన రోజా, ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో రీ-ఎంట్రీ ఇస్తున్నారు.సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై, దర్శకుడు డీ.డి. బాలచంద్రన్ రూపొందిస్తున్న కొత్త తమిళ చిత్రంలో రోజా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె వయసు పైబడిన, విషాదంలో ఉన్న మహిళగా కనిపించనున్నారు.రోజా రీ-ఎంట్రీని పురస్కరించుకుని నటి ఖుష్బూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. “90s క్వీన్ రోజా తిరిగి వస్తోంది!” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఆ వీడియోలో రోజా పాత హిట్ సినిమాల క్లిప్స్‌తో పాటు కొత్త చిత్రంలోని సన్నివేశాలు చూపించారు.

అభిమానులు ఈ చిత్రంతో రోజా మరోసారి శక్తివంతమైన నటిగా తన సత్తా చాటబోతున్నారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media