Cinema :రెజీనా కాసాండ్రా 20 ఏళ్లు CINE ప్రయాణం

December 23, 2025 12:27 PM

నటి రెజీనా కాసాండ్రా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ వారంలో తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను మరియు నటన పట్ల తనకున్న మక్కువను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.’కండ నాళ్ ముదల్’ సినిమాతో మొదలైన తన ప్రయాణం నేడు పాన్-ఇండియా స్థాయికి చేరుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

రెజీనా 1990 డిసెంబర్ 13న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ నుండి సైకాలజీలో బి.ఎస్సీ, మద్రాస్ యూనివర్సిటీ నుండి కౌన్సెలింగ్ సైకాలజీలో M.SC (మాస్టర్స్) పూర్తి చేశారు. 2005లో తమిళ చిత్రం ‘కండ నాళ్ ముదల్’ ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె తమిళంలో ‘అళగియ అసుర’, కన్నడలో ‘సూర్యకాంతి’, తెలుగులో ‘శివ మనసులో శృతి’ చిత్రాల ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. 2018లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రంతో హిందీలో అడుగుపెట్టారు.
పాఠశాల దశలోనే రెజీనా ‘స్ప్లాష్’ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేశారు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత 2016లో హైదరాబాద్‌లో జరిగిన IIFA ఉత్సవంకు యాంకరింగ్‌ చేసి అలరించారు. ఆమె ‘లైఫ్ ఈజ్ ఎ బాల్’, ‘ఆదిత్య మెహతా ఫౌండేషన్’, ‘టీచ్ ఫర్ చేంజ్’ మరియు ‘పెటా’ (PETA) వంటి సంస్థలకు మద్దతుదారుగా ఉన్నారు. 2011 నుండి ఆమె శాకాహారిగా (Vegan) జీవిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సైకాలజీపై ఆమెకు ఉన్న మక్కువ తగ్గలేదు. భవిష్యత్తులో తన కౌన్సెలింగ్ సైకాలజీ విద్య ద్వారా సమాజానికి సేవ చేయాలని ఆమె భావిస్తున్నారు.

ఒక క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడానికి ముందు చేసే హోంవర్క్ తనకు ఎంతో కిక్ ఇస్తుందని రెజీనా తెలిపారు. కాలంతో పాటు నటనలో పరిణితి సాధించానని, ఇప్పుడు కథల ఎంపికలో ప్రాధాన్యతలు మారాయని ఆమె వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media