భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు, ‘కేజీఎఫ్’ (KGF) సంచలనం యశ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఈసారి అభిమానులు తన ఇంటి వద్దకు రావద్దని యశ్ కోరినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు ఈ రోజును ఒక పండుగలా నిర్వహిస్తున్నారు.
కన్నడ టెలివిజన్ రంగం నుండి ప్రయాణం మొదలుపెట్టిన యశ్, ‘కేజీఎఫ్’ 1 & 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ఎదిగారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

తనపై చూపించే నిరుపమానమైన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ యశ్ తన అభిమానులకు ఒక లేఖ రాశారు. తాను చేయబోయే తదుపరి చిత్రాలు మీ నిరీక్షణకు తగినట్లుగా ఉంటాయని ప్రామిస్ చేశారు. యశ్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమాన సంఘాలు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
