Cinema :సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’పై చైనా ఫైర్

December 30, 2025 4:21 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా వార్ డ్రామా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ టీజర్ విడుదలైన కొద్దిసేపటికే అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ఈ చిత్రం వాస్తవాలను వక్రీకరిస్తోందని చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఆరోపించింది. గాల్వాన్ ఘర్షణల చిత్రీకరణ వాస్తవ విరుద్ధంగా ఉందని చైనా మీడియా పేర్కొంది. “సినిమా ఎంత భావోద్వేగంగా ఉన్నా చరిత్రను మార్చలేదని, చైనా సార్వభౌమత్వాన్ని రక్షించడంలో తమ సైన్యం (PLA) పట్టుదలను ఏ సినిమా కదిలించలేదని” గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రను పోషించారు. ఆయన వీరోచిత త్యాగాన్ని చైనా మీడియా తక్కువ చేసి చూపుతోంది.

చైనా స్పందన చూస్తుంటే వారిలో ఉన్న అభద్రతా భావం కనిపిస్తోందని, భారతీయ చిత్రనిర్మాతలు శత్రుదేశాల కుట్రలను బట్టబయలు చేస్తారనే భయం వారిలో ఉందని నిర్మాత అశోక్ పండిట్ పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్, అపూర్వ లఖియా వంటి దిగ్గజాలు సరైన పరిశోధన లేకుండా సినిమా తీయరని, చైనా మీడియా వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించలేదని నిర్మాత రాహుల్ మిత్రా స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media