దర్శకధీరుడు S.S రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB29 నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది.
సినిమా బృందం నేడు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన ‘కుంభ’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ చూస్తే ఆయన విలన్ రోల్‌లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ “గ్లోబ్ ట్రాటర్ (Globetrotter)” జరగనుంది.అదే వేడుకలో సినిమా టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలను రాజమౌళి ప్రకటించనున్నారు.
అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్, మహేష్ బాబు కెరీర్‌లో అత్యంత పెద్ద పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా నిలవనుంది.విశేష సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ ను ప్రఖ్యాత డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ తో ఓపెన్ చెయ్యాలని చిత్ర యూనిట్ టాక్ ,avatar సినిమా ప్రొమోషన్స్ కోసం జేమ్స్ కెమరూన్ వస్తున్నారు అని టాక్ఈ ఈవెంట్ మొత్తం jio hotstar సమాచార హుక్కులను తీసుకున్నట్టు తెలుస్తుంది

