బాలీవుడ్ అగ్ర జంట విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ, నాలుగవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇటీవల బాబుకు జన్మనిచ్చిన ఈ జంట, తమ ప్రత్యేక రోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పంచుకున్నారు.

నాలుగవ వివాహ వార్షికోత్సవం ,ఈ జంట ఇటీవలే మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు.
కత్రినాతో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ, విక్కీ కౌశల్ తమ ప్రస్తుత పరిస్థితిని హాస్యంగా పంచుకున్నారు. తాము “కృతజ్ఞతతో మరియు నిద్ర లేమిలో” ఉన్నామని (Grateful and Sleep Deprived) పేర్కొన్నారు ఇది కొత్త తల్లిదండ్రుల ఆనందాన్ని, వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.
విక్కీ, కత్రినా 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.
