దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ, కోర్టులో విజయ్ తరపున వాదిస్తున్న లాయర్ సతీష్ పరాశరన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. సీనియర్ అడ్వకేట్ అయిన సతీష్ పరాశరన్, వెండితెర దిగ్గజం కమల్ హాసన్ సోదరి కుమారుడు (మేనల్లుడు).
జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేట్ నిరాకరిస్తూ రివైజింగ్ కమిటీకి పంపింది. దీనిని సవాలు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. సతీష్ పరాశరన్ తండ్రి కె. పరాశరన్ భారత మాజీ అటార్నీ జనరల్ మరియు అయోధ్య రామమందిర కేసులో కీలక పాత్ర పోషించిన గొప్ప న్యాయకోవిదుడు.

రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై కావాలనే జాప్యం చేస్తున్నారని సతీష్ పరాశరన్ కోర్టులో బలంగా వాదించారు. మెజారిటీ సభ్యులు ఓకే చెప్పిన తర్వాత కేవలం ఒక్క సభ్యుడి ఫిర్యాదుతో సర్టిఫికేట్ ఎలా ఆపుతారని ప్రశ్నించారు. కమల్ హాసన్ మేనల్లుడు తమ హీరో కోసం వాదించడం చూసి విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో సతీష్ పరాశరన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు
