CM చంద్రబాబుతో జనగణన డైరెక్టర్ భేటీ.. మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

March 11, 2026 9:36 AM

N. Chandrababu Naiduతో రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ J. Nivas భేటీ అయ్యారు. Amaravatiలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2027 జనగణన కార్యక్రమంపై ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

2027 జనగణన ప్రక్రియను రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి మే 30 వరకు హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇళ్ల పరిస్థితులు, గృహాల్లోని సదుపాయాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు ఈ దశలో నమోదు చేయనున్నారు.అలాగే ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ గణన (Self Enumeration) చేసే అవకాశం కూడా ప్రజలకు కల్పించనున్నారు. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ యాప్‌లు, ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా సమాచార సేకరణ జరుగుతుందని చెప్పారు. అలాగే ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ విధానంలో కూడా జనగణన చేపట్టనున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media