ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు దాదాపు గంటపాటు సమావేశమై రాష్ట్ర వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ అంశాలపై చర్చించారు.
మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టాలను వివరించిన సీఎం చంద్రబాబు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర సహకారం కోరారు. పీఎం-ఆర్కేవివై-పీడీఎంసీ స్కీం కింద 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.695 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
తోతాపూరి రైతుల కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వ వాటా రూ.100 కోట్లు విడుదల చేయాలని కూడా సీఎం చంద్రబాబు కోరారు.


