దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి ఇండస్ట్రియల్ పార్క్ లో APIIC పేజ్2 ప్రాజెక్ట్ కింద ప్లాటిడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
సభా కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆర్డిఓ మురళి కృష్ణ, దాచేపల్లి తహసీల్దార్ మరియు ఇతర అధికారులు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


