APలో ఇంటి స్థలం లేని వారికీ గుడ్ న్యూస్ : CM చంద్రబాబు

February 28, 2026 1:38 PM

ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో హౌసింగ్, వ్యవసాయ పద్దులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ కీలక హామీలు ఇచ్చారు.

ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్లకు పైగా గృహ ప్రవేశాలు చేయిస్తామని సీఎం ప్రకటించారు. ఉగాది నాటికే 3 లక్షల ఇళ్లు సిద్ధమవుతాయని తెలిపారు. ఇళ్లు లేని 2.20 లక్షల కుటుంబాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తామన్నారు. ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ రంగంలో జరిగిన అక్రమాలను వదిలిపెట్టబోమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వ్యవసాయ రంగం – పంచ సూత్రాలు:

ఎన్నికల హామీ ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని (రాష్ట్ర వాటా రూ. 14,000 + కేంద్రం రూ. 6,000) సీఎం గుర్తుచేశారు. అగ్రిటెక్, ఏఐ (AI) సేవలను సాగులోకి తెచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. ఉచిత విద్యుత్ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 13,722 కోట్లు కేటాయించామన్నారు. రాయలసీమను లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రపంచ స్థాయి ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ. 1.50 కే అందిస్తూ రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media