AP ని దేశంలోనే SHIPPING HUBగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్ మరియు ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి కేంద్ర సాయం కోరుతూ పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

దుగరాజపట్నంలో ‘నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ & షిప్ రిపేర్ క్లస్టర్’ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దీని కోసం 3,488 ఎకరాల భూమిని సిద్ధం చేశామని, టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR) కూడా సిద్ధమైందని వివరించారు.కేంద్రం తీసుకొచ్చిన ‘చిప్ టు షిప్’ విధానానికి అనుగుణంగా MSME యూనిట్లు, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల కోసం కేంద్రం నుంచి సుమారు రూ. 590.91 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఫేజ్-1లో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పూర్తికి రూ. 440.91 కోట్లు అవసరమని పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా ఓడరేవు (Odarevu) ఫిషింగ్ హార్బర్‌కు సాగరమాల పథకం కింద రూ. 150 కోట్లు మంజూరు చేయాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం హామీలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం విన్నవించారు.
