కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలగట్లలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భూ యజమానుల హక్కులకు పూర్తి భరోసా కల్పిస్తూ రూపొందించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన రైతులకు అందజేశారు.గత ప్రభుత్వ ముద్రను తొలగించి, అధికారిక రాజముద్రతో, అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కూడిన పాస్ పుస్తకాలను సీఎం రైతులకు పంపిణీ చేశారు.
బహిరంగ సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ విభాగాల స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించి, రెవెన్యూ సంస్కరణలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.భూ వివాదాలకు తావులేకుండా, రైతుల భూమికి శాశ్వత రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
