మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు.

మహిళలు, జనసేన, బీజేపీ నేతలతో కలిసి జరిగిన ఈ నిరసనలో సీఎం స్వయంగా ప్లకార్డు పట్టుకుని పాల్గొన్నారు. మహిళా సాధికారతకు మద్దతుగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ ర్యాలీలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌కు కట్టుబడి ఉందని, బిల్లుకు మద్దతు కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

