CM చంద్రబాబుతో Sanjay dutt భేటీ

March 25, 2026 10:31 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, సినిమా షూటింగ్‌లు, ఫిలిం ప్రొడక్షన్ అవకాశాలపై చర్చించారు.

ఏపీలో సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం వివరించారు. ఫిలిం స్టూడియోలు, షూటింగ్ లొకేషన్లు ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సంజయ్ దత్‌ను సీఎం ఆహ్వానించారు. ఏపీని సినిమా షూటింగ్‌లకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media