CM చంద్రబాబు మాతృభాష ప్రకటనపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ హర్షం

March 6, 2026 10:04 AM

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను స్వాగతించారు. తెలుగును కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం ప్రకటించడం శుభపరిణామమని ఆయన అన్నారు.మాతృభాషలో విద్యాబోధన జరిగితే విద్యార్థులకు సబ్జెక్టులు సులభంగా అర్థమై, చదువులో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో మాతృభాష పరిరక్షణకు భరోసా లభించిందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media