AP:మంగళగిరిలో CM సహాయనిధి చెక్కుల పంపిణీ

April 2, 2026 12:05 PM

మంగళగిరి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ సహాయం అందినట్లు తెలిపారు.

లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన తుమ్మలచర్ల అరుణకు రూ.1,04,863, షరాఫ్ బజార్‌కు చెందిన తిరువీధుల వెంకట పద్మావతికి రూ.28,941, రత్నాల చెరువుకు చెందిన పందేటి మాధవికి రూ.25,574, పాత మంగళగిరికి చెందిన మునగాల స్వాతికి రూ.26,084, పెండ్ర శివమ్మకు రూ.20,524 విలువైన చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media