CM సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన MLA కురుగొండ్ల రామకృష్ణ

March 9, 2026 10:56 AM

Venkatagiri పట్టణంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే Kurugondla Ramakrishna స్వయంగా ఇళ్లకు వెళ్లి అందజేశారు. బాధిత కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికమే అర్హతగా భావించి ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సహాయం పెద్ద అండగా నిలుస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.తమ ఇంటికే వచ్చి సహాయం అందజేసిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media