పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా 50 మంది లబ్ధిదారులకు రూ.48,10,441 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 1,318 మందికి రూ.10.89 కోట్ల మేర సహాయం అందించామని తెలిపారు. పేదలు వైద్య అవసరాల కోసం సమర్పించే దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పార్టీలకు అతీతంగా ఎల్ఓసీలు, రీయింబర్స్మెంట్ సాయాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.లబ్ధిదారుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
