Constableసౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు రూ. కోటి చెక్కు CM రేవంత్

February 9, 2026 1:03 PM

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కానిస్టేబుల్ సౌమ్య మరియు ప్రమోద్ కుమార్ కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. శుక్రవారం నిజామాబాద్ పర్యటనలో ఉన్న సీఎం, రెండు కుటుంబాల సభ్యులను కలిసి ఒక్కొక్కరికి రూ. 1 కోటి విలువైన ఎక్స్-గ్రేషియా చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు.

జనవరి 23న నిజామాబాద్‌లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో స్మగ్లర్లు ఆమెపైకి వాహనాన్ని పోనిచ్చారు. తీవ్ర గాయాలపాలైన ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జనవరి 31, 2026) కన్నుమూశారు. గత ఏడాది అక్టోబర్‌లో నిజామాబాద్‌లో విధుల్లో ఉండగా దుండగుల దాడిలో (కత్తిపోట్లు) మరణించారు.ఆర్థిక సాయంతో పాటు, సౌమ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆమె రిటైర్మెంట్ వయస్సు వరకు పూర్తి జీతం చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ప్రమోద్ కుమార్ కుటుంబానికి కూడా కోటి రూపాయల సాయంతో పాటు 300 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

“అమర జవాన్ల త్యాగాలను ప్రభుత్వం మరువదు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుంది” అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media