కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రామడుగు మండల కేంద్రంలో రూ. 45.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇది స్థానిక యువతకు సాంకేతిక నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. గంగాధర మండలం మధురానగర్‌లో రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను విద్యా, ఉపాధి హబ్‌గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
