యాక్షన్ లోకి దిగిన సీఎం విజయ్.. వాటి మూసివేత

May 12, 2026 9:46 AM

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ విజయ్ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. తమిళనాడులో మొత్తం 4,765 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్న 717 షాపుల్లో.. 276 ప్రార్థనా స్థలాల దగ్గర, 186 విద్యాసంస్థల దగ్గర, 255 బస్టాండ్ల దగ్గర ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి ప్రాంతాల్లో మద్యం లభ్యతపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సామాజిక సంస్కరణ చర్య చేపట్టినట్లు కొత్త ప్రభుత్వం పేర్కొంది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై కూడా విజయ్ సంతకం చేశారు. ఇక 2021-2026 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media