తెలుగు సినిమా రంగంలో కామెడీ నటులు హీరోగా మారడం కొత్త విషయం కాదు. బ్రహ్మానందం, వేణు, వెన్నెల కిషోర్ వంటి హాస్య నటులు ఇప్పటికే ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు చేరబోతోంది.
ఇప్పటికే సత్యతో పనిచేసిన దర్శకుడు రితేష్ రాణా మళ్లీ ఆయనతో కొత్త సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం ఆయన ప్రత్యేక స్టైల్‌లో ఫన్ ఎంటర్టైనర్‌గా రూపొందనుందని సమాచారం. ఈసారి సత్య పూర్తి స్థాయి హీరోగా కనిపించనున్నాడు. సినిమాను ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సినీ వర్గాలు అంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ప్రస్తుతం సత్య అనేక ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అదనంగా మరికొన్ని సినిమాల్లో కూడా ఆయన నటనను ప్రేక్షకులు త్వరలో చూడనున్నారు.కామెడీ నటుడిగా మొదలైన సత్య హీరోగా మారుతున్న వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహం కలిగిస్తోంది. ఆయనను ప్రధాన పాత్రలో చూడాలన్న కోరికతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రితేష్ రాణా దర్శకత్వంలో సత్య హీరోగా నటించబోయే ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
