కాంగ్రెస్ దళిత వ్యతిరేఖి – కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

November 4, 2025 12:04 PM

కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, “దళితుల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. అక్కడి దళితులు కాంగ్రెస్ నేతలను నిలదీయాలి” అని పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా దళిత ఉద్యమం చేపడతామని హెచ్చరించిన ఆయన, “ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీలను విస్మరించింది. గరీబీ హఠావో నుంచి నేటివరకు కాంగ్రెస్ దళితులను మోసం చేస్తూనే ఉంది” అని అన్నారు.దళితబంధు నిధులను రూ.12 లక్షలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని, ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు. అలాగే ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు మహేశ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేకి” అని వ్యాఖ్యానించారు. సమితి తరఫున జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు ప్రకటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media