మున్సిపల్ కార్పొరేషన్ లో మామూళ్ల జాతర.

April 1, 2026 6:57 PM

కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు… పక్కా లోకల్ ఇక్కడ


కమీషనర్ ది ఏముంది పాపం బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల రాజ్యం.
ఏసీబీ అధికారులను భయపెడుతున్న మామూళ్ల పర్వం.

అమరావతి BNS ఏప్రియల్ 1: అవినీతికి అక్రమాలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలుమార్లు చెబుతున్నప్పటికీ, అక్రమ కట్టడాలకు అవినీతికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఏసీబీ అధికారులే స్పష్టం చేశారు. పకడ్బందీగా దాడులు చేస్తున్నప్పటికీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు చాకచక్యంగా తప్పించుకుంటున్నారని ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వటం సంచలనగా మారింది. అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో, అవినీతి ముసుగులో, అక్రమ కట్టడాలు కూడా ఇబ్బంది ముబ్బడిగా వెలుస్తున్నాయి.

రాజధానికి అతి సమీపంలో ఉన్న విజయవాడ నగరంలో ఒక మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఒక పురుష బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మాత్రం యథేచ్ఛ గా అక్రమ కట్టడాలకు అనుమతిస్తున్నారని కార్పొరేషన్ లో టాక్. ఈ అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఏసీబీ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. లో కాసులు ఉంటే చాలు ఎక్కడున్నా చక్రం తిప్పొచ్చు అని నిరూపిస్తోంది ఒక మహిళ బిల్డింగ్ ఇన్స్పెక్టర్. గతంలో అత్యంత వివాదాస్పదంగా ఉన్న ఈవిడ అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని, నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగులను నిర్మించినప్పటికీ, ఆవిడ తలుచుకుంటే కమిషనర్ కూడా అనుమతి ఇవ్వాల్సిందే అంటున్నారు.

గతంలో పాత బస్తీలో దలవాయి సుబ్బరామయ్య స్కూల్ పక్కన అక్రమంగా 700 గజాల్లో అపార్ట్మెంట్ నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఉన్నాయని స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గృహ నిర్మాణానికి అవసరమైన కట్టడాల నిర్మించేందుకు 18 మీటర్లు ఎత్తు మాత్రమే నిర్మించాలి. వ్యాపార అవసరాలకు 15 మీటర్లు మాత్రమే ఎత్తులో నిర్మాణాలు ఉండాలి. అయినప్పటికీ, ఈ ఏరియాలో బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. స్థానికంగా ఉండేవాళ్లు ఎత్తు ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవటంతో… స్థానికులు కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు పక్కన పెట్టవలసి వచ్చినప్పుడు, మామూళ్ల మత్తులో తూగుతున్న అధికారులు అవేమీ పట్టించుకోలేదు. కోర్టు నిబంధనలను కూడా ఉల్లంఘించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు.

మరొక బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఎక్కడ ఉద్యోగం చేసిన విజయవాడ మొత్తంలో అనధికార కట్టడాలకు ఇతనే టోకెన్ కోసి మరి రేటు నిర్ణయించి పర్మిషన్ ఇస్తాడు. ఇతను చరిత్ర చెప్పుకుంటే చాలా గొప్పగా ఉంటుంది, అవినీతి నిరోధక అధికారులను బుట్టలో వేసుకోవటంలో ఇతను దిట్ట. సర్వీస్ రూల్స్ ను బ్రేక్ చేయడంలో ఇతన్ని మించిన వ్యక్తి లేరు. విధుల నిర్వహణలో భాగంగా మూడు సంవత్సరాల కంటే స్థానికంగా పనిచేయకూడదని నిబంధనలు ఉన్నాయి. బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ గా ఎనిమిది సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నా ముట్టుకునే వాళ్లే లేరు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు క్రితం ఏసీబీ దాడులు నిర్వహించినప్పటికీ ఇతను టచ్ చేయాలంటేనే అవినీతి అధికారులు సైతం భయపడుతుంటారు. ఎవరికీ లేని సమాచారం ఏసీబీ వారి నుంచి ఇతనికి అందుతుంది.

ఏసీబీ అధికారులు పకడ్బందీగా మూడుసార్లు టౌన్ ప్లానింగ్ మీద దాడులు చేసినప్పటికీ, ఏసీబీ లో ఉన్న కిందిస్థాయి సిబ్బంది మ్యాటర్ ను లీక్ చేస్తుంటారు. రెండు రోజులు ముందుగానే ఈ ఇన్ స్పెక్టర్ సెలవు పెట్టి విహారయాత్రలకు తిరుగుతూ ఉంటారు. విజయవాడలోని అతి ఖరీదైన ప్రాంతాలు,పటమట సర్కిల్, సెంట్రల్ సర్కిల్, ప్రాంతాలలో ఏకధాటిగా 8 సంవత్సరాలు విధులు నిర్వహించారు. ఎవరైనా ఏదైనా అంటారని తూతూ మంత్రంగా మూడు నెలలు మాత్రమే నందిగామ లో విధులు నిర్వహించి మరల తిరిగి విజయవాడకు పోస్టింగ్ వేయించుకున్నారు. విజయవాడలో ఇంకా ఏదైనా సర్కిల్ కు వేయించుకున్నారు అంటే, అత్యధిక ఆదాయం వచ్చే పటమటకే ఇతను పోస్టింగ్ వేయించుకోవడం విశేషం. కింది స్థాయి అవినీతి అధికారులతో చెప్పి మరి ఉన్నత స్థాయి అధికారులను బ్లాక్ మెయిల్ చేయించి తన పోస్టింగులు వేయించుకుంటూ ఉంటారు.

భవానిపురం పరిధిలోకి వచ్చే మరొక బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ లీలలు అక్రమాలు చెప్పుకునేందుకు కూడా సరిపోవు. ఒక స్కూల్ ఎదురుగా భారీ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదు చేసినప్పటికీ, భారీగా లంచాల దండుకున్న ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కేవలం రేకులు మాత్రమే పీకి మామ అనిపించారు. భవానీపురంలో అనేక అక్రమ నిర్మాణాలు ఈ ఇన్ స్పెక్టర్ అండదండలు ఉన్నాయనేది వాస్తవం.

ఇప్పటికైనా అవినీతి తిమింగలాల మీద చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రజలు ముక్తకంఠంతో కోరుకొంటున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media