కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయన కుమారుడిపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి, బండి సంజయ్ పేరును ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను తక్షణమే తొలగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విషయంలో ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించరాదని స్పష్టం చేసింది. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బండి సంజయ్ నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. గూగుల్, మెటా, ఎక్స్ కార్ప్‌తో పాటు పలు టీవీ ఛానెళ్లను ప్రతివాదులుగా చేర్చి ఆయన దావా వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని రకాల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
