న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం (జనవరి 3) వర్చువల్‌గా సమావేశం కానుంది. ఈ జట్టు ఎంపికలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పునరాగమనంపైనే అందరి కళ్లు నెలకొన్నాయి.

సుమారు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న షమీ, విజయ్ హజారే ట్రోఫీలో 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రాకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉండటంతో షమీకి పిలుపు అందే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్ ద్వారా వన్డే కెప్టెన్‌గా పునరాగమనం చేయనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించి ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు.

రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాకు టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. జనవరి 11న వడోదరలో తొలి వన్డే ప్రారంభం కానుంది. తదుపరి మ్యాచ్‌లు రాజ్‌కోట్ (జనవరి 14), ఇండోర్ (జనవరి 18)లలో జరగనున్నాయి.
.
