నిజామాబాద్ జిల్లాలో పాశవిక హత్య కలకలం రేపింది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం దొరకడంతో సంచలనం చెలరేగింది.బాసర ప్రధాన రహదారి సమీపంలో మొండెం మాత్రమే కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు మహిళ తలను వేరు చేయడంతో పాటు ఒక చేయి, మరో చేతి వేళ్లను కూడా నరికివేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం నగ్నస్థితిలో ఉండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాల కోసం గాలింపు ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో ఇది రెండో మహిళ హత్య కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు
Crime:నిజామాబాద్‌లో దారుణం – మహిళను హత్య చేసి తలను నరికిన దుండగులు
