Gachibowliలోని Cyberabad Police Commissionerate పరిధిలో మిస్సింగ్ అయిన 1016 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ Avinash Mohanty పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశంలో మొబైల్ ఫోన్ రికవరీ విషయంలో తెలంగాణ పోలీసులు రెండో స్థానంలో ఉన్నారని తెలిపారు. ఫోన్ పోయినప్పుడు వెంటనే సిఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోందని, బ్యాంకింగ్, ఉద్యోగాలు, పిల్లల విద్య వంటి అనేక సేవలు ఫోన్‌తో అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు. మొబైల్లో యాప్‌లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.సైబర్ నేరాల ద్వారా జరిగిన 103 కేసుల్లో సుమారు రూ.63 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు.
