మొంథా తుపాను పీడిత ప్రాంతాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు ప్రాంతాన్ని పరిశీలించారు. తుపాను కారణంగా పంట పొలాలు, మొక్కలు, సాగు భూములు తీవ్రంగా దెబ్బతిన్నాయి., రైతుల సమస్యలు, ప్రభుత్వ సాయం మీద ముఖ్యమైన వివరాలు సేకరించారు. ఈ సందర్బంగా ఆయన రైతులకు ధైర్యం చెప్పుతూ, ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పర్యటనలో స్థానిక అధికారులు, రైతు సంఘాలు, స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.
