దాచేపల్లి పట్టణంలోని బొడ్రాయి సెంటర్లో ఉన్న ఒక బట్టల దుకాణంలో దొంగతనానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, నలుగురు గుర్తుతెలియని మహిళలు షాపులోకి ప్రవేశించి వస్త్రాలను అపహరించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళ వారిని గమనించడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో ఆ మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, పరారైన వారిలో ఒక మహిళను పట్టుకుని విచారణ చేపట్టారు. ఆమె వద్ద ఉన్న వస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు దాచేపల్లి C.I రాజేష్ తెలిపారు.
