అనుమానంగా కనిపించడంతో బ్యాగ్ తనిఖీ
- ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడి బ్యాగులో భద్రతా తనిఖీల సమయంలో అనుమానాస్పద వస్తువు గుర్తించారు.
- బ్యాగ్‌ను పూర్తిగా తనిఖీ చేయగా అందులో కోతి పుర్రె బయటపడింది.
- వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాగులో పుర్రె చూసి షాకైన సెక్యూరిటీ సిబ్బంది
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విమానం ఎక్కే ముందు నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ఓ ప్రయాణికుడి బ్యాగులో కోతి పుర్రె కనిపించడం కలకలం రేపింది. అనుమానంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. విమానం ఎక్కే ముందు ప్రయాణికుల బ్యాగులను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రయాణికుడిని పక్కకు తీసుకెళ్లి బ్యాగ్‌ను పూర్తిగా తనిఖీ చేశారు.
ఫ్లైట్ ఎక్కే ముందు నిర్వహించిన భద్రతా తనిఖీల్లో ఓ వ్యక్తి బ్యాగులో కొతి పుర్రె లభించిన ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఓ ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చాడు. అయితే విమానం ఎక్కే ముందు బ్యాగులను తనిఖీ చేస్తుండగా.. అతడి బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో అతన్ని పక్కకు తీసుకొని బ్యాగును పూర్తిగా తనిఖీ చేయగా అందులో ఓ పుర్రె బయటపడింది.కోతి పుర్రె అని చెప్పిన ప్రయాణికుడు
బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ఓ పుర్రె బయటపడింది. అది చూసి షాకైన అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బ్యాగులో ఉన్నది కోతి పుర్రె అని అతడు చెప్పినట్లు సమాచారం.
అయితే వన్యప్రాణులకు సంబంధించిన వస్తువులను అనుమతులు లేకుండా తరలించడం చట్టవిరుద్ధం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రయాణికుడిని, స్వాధీనం చేసుకున్న పుర్రెను తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు
ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికుడి వద్దకు కోతి పుర్రె ఎలా వచ్చింది? దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో ఎయిర్‌పోర్టుల్లో భద్రతా తనిఖీలు ఎంత అప్రమత్తంగా జరుగుతున్నాయో మరోసారి స్పష్టమైంది. ప్రయాణికుల భద్రతతో పాటు వన్యప్రాణులకు సంబంధించిన అక్రమ రవాణాను అడ్డుకోవడంలోనూ భద్రతా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.



