ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్టోబర్ 28న మొదటి క్లోడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహించారు.
IIT కాన్పూర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన విమానం ద్వారా బురారీ ప్రాంతంలో ప్రయోగం జరిగింది.
ఈ విధానం విజయవంతమైతే, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక అడుగుగా మారవచ్చు.విమానాలులు మీరత్, ఖేక్రా, బురారీ, సడక్పూర్, భోజ్పూర్, అలీగడ్ వంటి ప్రాంతాల్లో ప్రయాణించింది. ఖేక్రా-బురారీ మరియు బాద్లీ ప్రాంతాల్లో ఫ్లేర్లను ఉపయోగించి వర్ష ప్రేరేపణ ప్రయత్నం జరిగింది. IMD సూచన ప్రకారం, అక్టోబర్ 28, 29, 30 వరకు వర్షం పరిస్థితులు ఉండవచ్చు. మొదటి కృత్రిమ వర్షం అక్టోబర్ 29కి ఉండవచ్చని అంచనా.
