‘ప్రాజెక్ట్ హనుమాన్’ ప్రారంభం వన్యప్రాణి సంఘర్షణకు చెక్ Dy cm

March 3, 2026 4:06 PM

“భూమి మనిషికే కాదు, జంతువులకు కూడా సొంతం” అనే వసుధైక కుటుంబం భావనతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.వన్యప్రాణి సంఘర్షణను ‘కాన్ఫ్లిక్ట్’ నుంచి ‘కో-లివింగ్’ (సహజీవనం) వైపు మలచడమే “ప్రాజెక్ట్ హనుమాన్” ప్రధాన ఉద్దేశమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ గ్రౌండ్స్‌లో ఈ వినూత్న ప్రాజెక్టును ఆయన ఘనంగా ప్రారంభించారు.

చిత్తూరు, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లో ఏనుగులు, ఇతర వన్యప్రాణుల వల్ల కలిగే పంట, ప్రాణ నష్టాన్ని శాస్త్రీయంగా అరికట్టడం. రాష్ట్రవ్యాప్తంగా 100 వాహనాలను ప్రారంభించారు. ఇందులో 93 రాపిడ్ రెస్పాన్స్ టీమ్ వాహనాలు, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సులు ఉన్నాయి. ఏఐ (AI) ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, జీపీఎస్ ట్రాకింగ్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల దాడిలో మృతి చెందిన వారికి ఇచ్చే పరిహారాన్ని ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గాయపడిన వారికి ₹2 లక్షలు అందజేస్తారు.కర్ణాటక ప్రభుత్వ సహకారంతో 4 కుంకీ ఏనుగులను వినియోగిస్తున్నామని, ఇప్పటికే 8 ఆపరేషన్లు విజయవంతం అయ్యాయని వెల్లడించారు.అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖలు సమన్వయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media